Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ఆహారంతో గుండెకు రక్షణ!

foods to keep your heart healthy in summer
Advertisement
  • వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో గుండెకు పెరిగే రిస్క్
  • శరీరంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి
  • వాటర్ మెలాన్, కీరదోస, బెర్రీలు, బొప్పాయి పండ్లు తినాలి
Advertisement
వేసవిలోకి అడుగు పెట్టాం. ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. పెరిగిపోయే ఉష్ణోగ్రతలతో గుండెకు హాని కలగకుండా చూసుకోవాలి. వేసవిలో గుండె ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. కనుక హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. కనుక అదనపు శ్రద్ధ అవసరం. వేసవిలో శరీరంలో నీరు, లవణాలు కోల్పోకుండా చూసుకోవాలి. వేసవి తాపానికి శరీరం లవణాలను కోల్పోతుందని చెప్పి కొందరు ఉప్పు అదనంగా తీసుకుంటూ ఉంటారు. కానీ, ఉప్పుతో గుండెకు హాని జరుగుతుంది. దీనికి బదులు రోజు మొత్తం మీద 3-4 లీటర్ల నీరు, పండ్లు తీసుకోవాలన్నది వైద్యుల సూచన.

పుచ్చకాయ
ఇది వేసవిలో వచ్చే పండు. కానీ, నేడు అన్నికాలాల్లోనూ దీన్ని పండిస్తున్నారు. ఇందులో 92 శాతం నీరే ఉంటుంది. పైగా మంచి పోషకాలు కూడా ఉంటాయి. లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉంటుంది. అనారోగ్యాన్ని తగ్గించే శక్తి దీనికి ఉంది. శ్వాసకోస వాపులను తగ్గిస్తుంది. 

బెర్రీలు
స్ట్రాబెర్రీ, గోజి బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ గుండెకు మంచి చేసేవి. 

బొప్పాయి
బొప్పాయి పండులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు పపైన్ అనే కాపౌండ్ ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ను పపైన్ తగ్గిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది. 

కీరదోస
కరీదోసలోనూ నీటి శాతం ఎక్కువ. విటమిన్ సీ, ఫైబర్ లభిస్తాయి. కనుక వేసవిలో తప్పకుండా దీన్ని తీసుకోవాలి. 

సీడ్స్
ఫ్లాక్స్ సీడ్స్, చియాసీడ్స్ తోనూ గుండెకు రక్షణ లభిస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

వెల్లుల్లి
రక్తాన్ని పలుచన చేసే గుణం వెల్లుల్లికి ఉంటుంది. దీనివల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ప్రొటీన్ 
శరీరంలో నీటి పరిమాణం నిలిచి ఉండాలంటే ప్రొటీన్ కూడా అవసరమే. ఒక కిలో శరీర బరువుకు ఒకగ్రాము చొప్పున రోజూ ప్రొటీన్ అవసరం. కాకపోతే రెడ్ మీట్ (పంది, గొడ్డు, మేక, గొర్రె మాంసం) వేసవిలో తీసుకోవడం మంచిది కాదు. చేపలు, చికెన్ తీసుకోవచ్చు.
Advertisement
Advertisement
foods
summer
heart
health

More Telugu News